టీడీపీలో ‘ఉండి’ టికెట్ రచ్చ!

17
- Advertisement -

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక్కడ వైసీపీ తరుపున పీవీఎల్ నరసింహరాజు పోటీలో ఉన్నారు. అటు కూటమిలో భాగంగా టీడీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు కు టికెట్ కేటాయించారు చంద్రబాబు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ సడన్ గా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు టీడీపీలో చేరడంతో అసలు సమస్య మొదలైంది. ఈయన మొదట నర్సాపురం టికెట్ ఆశించారు. కానీ అక్కడ కూటమిలో భాగంగా బీజేపీ తరుపున శ్రీనివాస్ వర్మకు టికెట్ కేటాయించారు. అయితే అభ్యర్థి మార్పు కోసం రఘురామ ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ ససేమిరా అనడంతో ఉండి అసెంబ్లీ సీటును రఘురామకు కేటాయించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మొదట తనను అభ్యర్థిగా ప్రకటించి ఇప్పుడు సీటు వేరే వారికి ఇవ్వడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు టీడీపీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారట. తను ఎట్టి పరిస్థితీల్లో ఉండి సీటు వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నరట. మరోవైపు రఘురామ మాత్రం తనకు ఉండి టికెట్ కన్ఫర్మ్ అయిందని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు,. దీంతో ఉండి సీటుపై రాజకీయ వేడి రగులుకుంది. అయితే ఉండిలో అభ్యర్థి మార్పుపై టీడీపీ నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రఘురామ మాత్రం అప్పుడే ప్రచార కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేందుకు సిద్దమౌతున్న టు టాక్. ఒకవేళ ఉండి టికెట్ రఘురామకు కేటాయిస్తే తను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు చెబుతున్నారు, దీంతో టీడీపీ అధిష్టానం డైలమాలో పడింది. మంతెన రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే టీడీపీకి భారీ స్థాయిలో నష్టం తప్పదు. మరి ఉండి నియోజక వర్గంలో ఏర్పడిన ఈ చిక్కు ముడిని చంద్రబాబు ఎలా విప్పుతారో చూడాలి.

Also Read:కోమటిరెడ్డి బ్రదర్స్ vs రేవంత్ రెడ్డి.. మళ్ళీ తెరపైకి?

- Advertisement -