అమెరికా బాటలోనే యూకే!

3
- Advertisement -

అక్రమ వలస దారులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. తొలుత భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్నారు. ట్రంప్. ఇప్పుడు ఇదే బాటలో మరో దేశం నిలిచింది.

అక్రమ వలసదారులపై కొరడా ఝుళిపించాలని నిర్ణయించినట్లు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ట్వీట్ చేశారు. చాలా మంది యూకేకి అక్రమంగా వచ్చి పనిచేస్తున్నారు… దీనికి మేం ముగింపు పలకబోతున్నాం అని పేర్కొన్నారు.

సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తించారు అమెరికా అధికారులు.డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. అక్రమంగా నివసించేవారి విషయంలో అమెరికాకు సహకరిస్తోంది భారత ప్రభుత్వం.

Also Read:లైలా వివాదంపై విశ్వక్ సేన్

- Advertisement -