నీరవ్ మోడీకి యూకేలో చుక్కెదురైంది. నీరవ్ మోడీకి బెయిల్ నిరాకరించింది లండన్ కోర్టు. బ్యాంకులకు రుణాలు ఎగవేసి పరారీలో ఉన్నారు నీరవ్ మోడీ. ఆయనకు బెయిల్ ఇస్తే తగిన సమయానికి హాజరు కావడంలో విఫలమవుతారని మరియు సాక్షులకు భయపెట్టే లేదా వారికి ముప్పుగా మారే అవకాశాలు ఉన్నాయని డిఫెన్స్ లాయర్ వాదించారు.
నీరవ్ మోడీ 2019 ఆరు సంవత్సరాలకు పైగా యూకేలో జైల్లో ఉన్నాడు. అతనిపై పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను $1 బిలియన్‌కు మించి మోసం చేశాడని అభియోగాలు ఉన్నాయి.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆస్తులను ఇప్పటికే ఈడీ జప్తు చేసింది . ఈడీ జప్తు చేసిన నీరవ్ ఆస్తుల్లో ముంబైలోని వర్లిలోగల ఓ భవనంలోని నాలుగు ఫ్లాట్లు, సముద్ర తీరంలోని ఒక ఫాంహౌజ్, అలీబాగ్‌లోని ఖాలీ స్థలం, జైసల్మేర్‌లోని విండ్ మిల్లు, లండన్‌లోని ఒక ఫ్లాట్, యూఏఈలోని రెసిడెన్షియల్ ఫ్లాట్లు, షేర్లు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి.
Also Read:వెల్లుల్లి.. ఎన్నో ప్రయోజనాలు!

