జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం…

68
Ujjal Bhuyan Oath
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నేడు ( మంగళవారం) జరిగిన, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు…ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ చేతుల మీదుగా అప్పాయింట్ మెంట్ పత్రాన్నిఉజ్జల్‌ భూయాన్‌కి అందచేశారు. అదుపరి తమిళిసై సౌందర రాజన్‌,ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. తదనంతరం తమిళిసై, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు పుష్పగుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. జాతియ గీతాన్ని ఆలపించి ఈ కార్యక్రమాన్ని ముగించారు.

ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ ని కేంద్రం ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. ఇక ఆ స్తానం లో జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేడు బాద్యతలు స్వీకరించారు. అసోంకు చెందిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 2011 అక్టోబర్‌ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 1964 ఆగస్టు 2న గువాహటీలో జన్మించారు. ఆయన తండ్రి సుచేంద్రనాథ్‌ భూయాన్‌ సీనియర్‌ న్యాయవాది. అసోం అడ్వొకేట్‌ జనరల్‌గా కూడా పనిచేశారు. ఉజ్జల్‌ భూయాన్‌ అక్కడి డాన్‌ బాస్కో ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, కాటన్‌ కాలేజీలో ఇంటర్‌, డిల్లీలోని కిరోరి మాల్‌ కాలేజీలో డిగ్రీ చేశారు. గువాహటీ ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, గువాహటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం చేశారు. 1991 మే 20న అసోం న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2019 లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పెద్దలు, హైకోర్టు జడ్జ్ లు, మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -