కరోనా వైరస్ నేపథ్యంలో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవాలంటే విద్యాసంస్థలు ఆన్‌లైన్ విద్యపై దృష్టి సారించాలని యూజీసీ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆన్‌లైన్ ద్వారా 25 శాతం, మిగిలిన 75 శాతం పాఠ్య ప్రణాళికను తరగతి గదిలో బోధించాలని సూచించింది. లాక్‌డౌన్ ఎత్తేసిన అనంతరం కూడా కొంత కాలం పాటు విద్యార్థులు భౌతిక దూరం పాటించడం తప్పనిసరని స్పష్టంచేసింది.
సాంకేతిక వినియోగంపై అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలి.
వర్చువల్ ప్రయోగశాలల ద్వారా ప్రాక్టికల్స్ చేయించడంపై దృష్టి పెట్టాలి.
ప్రతి విద్యాసంస్థ వర్చువల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
2020–21 విద్యా సంవత్సరం షెడ్యూల్
2020, ఆగస్టు 1 నుంచి 31వ తేదీ నాటికి డిగ్రీ, పీజీ ప్రవేశాలను పూర్తి చేయాలి.
ముందుగా ప్రొవిజనల్ అడ్మిషన్ ఇచ్చేయాలి. డాక్యుమెంట్లు, సరిఫ్టికెట్లు అందజేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడవును ఇవ్వాలి.
పాత విద్యార్థులకు (ద్వితీయ, తృతీయ సంవత్సరాల వారికి) విద్యా బోధన కార్యక్రమాలను ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించాలి.
ప్రథమ సంవత్సరంలో ఫస్ట్ సెమిస్టర్‌లో చేరే వారికి మాత్రం విద్యా బోధన కార్యక్రమాలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలి.
1–1–2021 నుంచి 25–1–2021 వరకు: పరీక్షల నిర్వహణ
27–1–2021 నుంచి: తదుపరి సెమిస్టర్ ప్రారంభం
25–5–2021 నాటికి: తరగతులు పూర్తి
25–6–2021 నాటికి: సెమిస్టర్ పరీక్షలు పూర్తి
1–7–2021 నుంచి 30–7–2021 వరకు: వేసవి సెలవులు
2–8–2021 నుంచి తదుపరి విద్యా సంవత్సరం ప్రారంభం ఉంటుంది.