ఉగాదికి ఫస్ట్ లుక్ షురూ !

21
- Advertisement -

త్రివిక్రమ్ – మహేష్ కలయికలో రాబోతున్న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ సంగతుల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ లుక్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. సహజంగా, త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోని చాలా బాగా చూపిస్తాడు. అందుకే.. ఈ సినిమాలో మహేష్ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది ? అని ఎప్పటి నుంచో అందరిలో బాగా కుతూహలంగా ఉంది. ఐతే, తాజాగా వారందరికీ ఓ శుభవార్త. మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది.

ఉగాది సందర్భంగా మార్చి 22న మూవీ టైటిల్ ను, ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ లుక్ కి సంబంధించిన వర్క్ ను కూడా త్రివిక్రమ్ పూర్తి చేశాడట. మహేష్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని క్లారిటీ ఉంది. మరి త్రివిక్రమ్ మహేష్ లుక్ ను ఎలా డిజైన్ చేశాడో చూడాలి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పూర్తి ఢిల్లీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు.

రాజకీయ నేపథ్యంలో త్రివిక్రమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ సినిమాలో ఎంటర్ టైన్ గా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ బాబు పాత్రలో మరో కొత్త కోణం కూడా ఉంటుందని.. తెలుగు సినిమా నేటివిటీకి ఫ్రెష్ టోన్ ను ఈ చిత్రం అందించబోతుందని తెలుస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి…

నాని.. ఓ తరానికి ప్రేరణ !

ఆ నటితో బీరు తాగించారట

నైజాం నవాబ్ ప్రభాసే.. ఇదే రుజువు!

- Advertisement -