ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన మహా సీఎం..

255
uddhav
- Advertisement -

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే . సోమవారం మధ్యాహ్నం మహారాష్ట్ర శాసనమండలి సెంట్రల్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్‌ ఉద్దవ్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయడంతో థాక్రే కుటుంబం నుంచి శాసనమండలిలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా, చట్టసభల్లో అడుగు పెట్టిన రెండో వ్యక్తిగా ఉద్ధవ్‌ థాక్రే నిలిచారు. ఇప్పటికే ఉద్ధవ్‌ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈ కార్యక్రమానికి ఉద్ధవ్‌ థాక్రే సతీమణి రష్మీ, కుమారుడు ఆదిత్య థాక్రే కూడా హాజరయ్యారు.

2019 నవంబర్ 28న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు ఉద్దవ్ ఠాక్రే. ఇటీవలె 9 స్ధానాలకు నోటిఫికేషన్ వెలువడగా నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఠాక్రే ఒకరు. ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.

- Advertisement -