క్లైమాక్స్‌కి మహా ఎపిసోడ్..సీఎంగా ఉద్దవ్..!

363
uddav thackre

డైలీ సీరియల్‌ను తలపిస్తున్న మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరింది. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి నేడు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ముంబైలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. ఇప్పటికే పదవుల పంపకం ఓ కొలిక్కి రావడంతో సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై కీలక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.

గురువారం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రేతో పాటు సంజయ్ రౌత్.. ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఆదివారం లేదా సోమవారం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఐదేళ్లు సీఎంగా ఉద్ధవ్ థాక్రే ఉంటారా.. లేక రెండున్నరేళ్లు శరద్ పవార్‌కు సీఎంగా చాన్సిస్తారా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. మొత్తంగా ఇవాళ జరిగే సమావేశం తర్వాత పూర్తిక్లారిటీ వచ్చే అవకాశం ఉంది.