యాంకర్‌ ఉదయభాను కవల పిల్లలను చూశారా…

317
Udaya Bhanu’s Cute Little Daughters

ఒకప్పుుడు తెలుగు బుల్లితెరపై తన ముద్ర వేసిన యాంకర్ ఉదయభాను గత కొంత కాలంగా ప్రేక్ష‌కుల‌కు క‌నిపించ‌కుండా పోయింది. ఒక సాధారణ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ తర్వాత స్టార్‌ యాంకర్‌గా మారింది. ఇప్పుడున్న అనసూయ,రెష్మీలు పొట్టి డ్రెస్‌లు వెసుకుని ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో అప్పుడు ఉదయభాను నిండుగా డ్రెస్‌లు వేసుకుని మంచి పేరు తెచ్చుకున్నారు. ఉదయ భాను వయసు తెలియక ఇప్పటికి ఎంతో మంది యువకులు తిక్క మక్కా పడుతుంటారు ఎందుకంటే ఉదయభాను అందం అలాంటిది.

Udaya Bhanu’s Cute Little Daughters

ఉదయభాను తన కెరీర్‌ ప్రారంభంలో కొన్ని తెలుగు,కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తరువాత బుల్లితెర మీద యాంకర్‌గా సెటిల్‌ అయ్యింది. అప్పట్లో జెమినీ టీవీ లో వచ్చే సాహసం చేయరా డింబక, ఒన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రామ్స్ వంటీ షోలతో టాప్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. లీడర్‌, జులాయి వంటి సినిమాల్లో ఐటెంసాంగ్స్‌తో మెరిసింది ఈ బుల్లితెర భామ.

Udaya Bhanu’s Cute Little Daughters

అయితే ఈ మధ్య ఉదయభాను ఏ టీవీ కార్యక్రమంలోనూ కనిపించడ లేదు. అందుకు కారణం ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కవల పిల్లల బాగోగులు చూసుకుంటూ బిజీ అయిపోయింది. గతేడాది ఆగస్టు 28న ఉదయభాను ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చింది. ఒకరికి యువి నక్షత్ర, మరొకరికి భూమి ఆరాధ్య అనే పేరు పెట్టారు. ఇప్పటి వరకు ఉదయభాను ఇద్దరు కూతుళ్లకు సంబంధించిన ఫోటోస్ బయటకు రాలేదు.

Udaya Bhanu’s Cute Little Daughters

ఇటీవల ప్రముఖ జర్నలిస్ట్ ప్రేమ… ఉదయభానును కలిసారు. ఈ సందర్భంగా ఆమె ఉదయభాను ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో జోరుగా షేర్‌ అవుతున్నాయి. అయితే తన సమయం అంతా పిల్లల కోసమే కేటాయిస్తున్నని… తాను సాధించిన అన్ని విజయాల కంటే.. తన పిల్లలే అతి పెద్ద విషయం అంటోందట ఉదయభాను. 2004లో విజయ్‌కుమార్‌ అనే వ్యాపారవేత్తను ఉదయభాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

గత కొంత కాలంగా టీవీషోలకు దూరంగా వున్న ఉదయభాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.