పవన్‌తో ఐటం భామగా భాను ..

219
Udaya Bhanu Item Song with Pawan Kalyan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ -త్రివిక్రమ్ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ కాంబో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రస్తుతం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కొన్ని రోజులుగా అక్కడ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చాలానే సర్ ప్రైజులను ఆడియన్స్ కు ఇవ్వబోతున్నాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

Udaya Bhanu Item Song with Pawan Kalyan

త్రివిక్రమ్ ఈ సినిమాలో ఉదయభానుతో ఓ ఐటెం సాంగ్ చేయించాలని చర్చలు జరుగుతున్నాయని సమాచారం‌. ఈమధ్య యాంకర్లతో ఐటెం సాంగ్స్ చేయించే కల్చర్ కూడా బాగానే ఊపందుకుంటోంది. పైగా ఉదయభాను కూడా ఈ మధ్యనే మళ్లీ యాంకరింగ్ స్టార్ట్ చేసింది. ఓ డ్యాన్స్ ప్రోగ్రాంను హోస్ట్ చేసేయనుంది. బతుకమ్మ పాటలో కూడా మెయిన్ అట్రాక్షన్‌గా ఉదయభానునే నిలిచింది. ఇలాంటి సమయంలో ఉదయభానుతో ఐటెం సాంగ్ చేయిస్తే.. అది కచ్చితంగా ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసే పాయింట్ అవుతుందని భావించాడట త్రివిక్రమ్. అంతేకాదు తాజాగా త్రివిక్రమ్‌తో ఉదయభాను కాసేపు మీటింగ్ కావడంతో ఈ కొత్త రూమర్స్ బయల్దేరాయి.

Udaya Bhanu Item Song with Pawan Kalyan

గతంలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే రూపొందిన జులాయి మూవీలో ఐటెం సాంగ్ చేసిన అనుభవం ఉండడంతో.. ఇప్పుడు కూడా ఒప్పేసుకుందని అంటున్నారు. అయితే.. ఉదయభాను ఐటెం సాంగ్ దాదాపు ఖాయమే కానీ.. ఇప్పుడు పవన్ తో రూపొందబోతోన్న సినిమాలో ఉంటుందా.. లేక మాటల మాంత్రికుడి మరుసటి సినిమా అయిన ఎన్టీఆర్ మూవీలో ఉంటుందా అనే విషయంపై క్లారిటీ రావాలంటే కాసింత టైం పడుతుంది.

- Advertisement -