రంజాన్ గిఫ్ట్..ఖైదీలకు క్షమాబిక్ష

11
- Advertisement -

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ రంజాన్ గిఫ్ట్ ఇచ్చారు. ఖైదీల‌కు క్ష‌మాబిక్ష ప్ర‌క‌టించారు ఆ దేశ‌ అధ్యక్షుడు. 1518 మందికి క్ష‌మా బిక్ష‌ ప్రకిటించగా 1295 మంది చిన్న నేర‌స్తులు విడుద‌ల‌ కానున్నారు. ల‌బ్ధిపొందిన వారిలో అయిదు వంద‌ల మందికి పైగా భార‌తీయులు ఉండగా దేశ అధ్య‌క్షుడికి క్ష‌మా ఖైదీలు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

ప్రతి ఏడాది రంజాన్ సందర్భంలో యూఏఈ ప్రభుత్వం నేరచరిత్ర ఉన్న కానీ, తీవ్ర‌మైన‌ కేసులలో కాకుండా చిన్నచిన్న నేరాలకు పాల్పడిన ఖైదీలను విడుదల చేసే సంప్రదాయం కొనసాగిస్తోంది. దీని ద్వారా వారికి మరో కొత్త జీవితానికి అవకాశం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.

యూఏఈ పాలకులు ఖైదీల పట్ల చూపుతున్న ఈ ఉదారత అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. శిక్షను పూర్తిగా అనుభవించినా, కొంత శిక్ష మిగిలి ఉన్నా, వారు భవిష్యత్తులో సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు.

Also Read:అప్పులపై రేవంత్ చెప్పినవన్నీ తప్పులే: కవిత

- Advertisement -