కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించేలా బీసీసీఐ షెడ్యూల్ రెడీ చేయగా ఐపీఎల్ రెండో దశ సమీపిస్తుండటంతో దుబాయ్‌లో సందడి మొదలైంది.
ఇప్పటికే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ యూఏఈకి చేరుకోగా ఐపీఎల్ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్‌లో అడుగుపెట్టింది డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్. ఆరు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకొని సాధన కూడా మొదలు పెట్టేసింది.
ప్రస్తుతం ధోని సేన క్వారంటైన్‌లో ఉండగా మిగిలిన జట్లు కూడా దుబాయ్ చేరుకుని క్వారంటైన్‌లో ఉండనున్నాయి. భారత్‌లో ఐపీఎల్ 14వ సీజన్ కు సంబంధించి 29 మ్యాచ్ లు జరగ్గా, మిగిలిన 31 మ్యాచ్ లను దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. సెప్టెంబరు 19న ఐపీఎల్ పోటీలు షురూ కానుండగా అక్టోబరు 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.