U19 World Cup : ప్రతీకారానికి టైమొచ్చింది!

22
- Advertisement -

గతేడాది జరిగిన వన్డే వరల్డ్ ఫైనల్ లో భారత్ ఓటమి చవిచూసి కప్పుకు అడుగు దూరంలో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో ఓటమి ఎరుగని జట్టుగా వరుస విజయాలతో అద్బుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చవిచూసి అందరిని నిరాశ పరిచింది. అయితే వరల్డ్ కప్ లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే టైమొచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా ఆస్ట్రేలియా జట్లు కప్పు కోసం తలపడనున్నాయి. ఈ నెల 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా జూనియర్ టీమ్ కూడా లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్ చేరుకుంది. అటు ఆస్ట్రేలియా కూడా సెమీస్ లో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు దూసుకొచ్చింది. .

దీంతో ఈ జూనియర్ జట్లు కప్పు కోసం నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం యువ టీమిండియాలో కెప్టెన్ ఉదయ్ సహరన్, ముషీర్ ఖాన్, వంటి ఆటగాళ్లు అద్భుతమైన బ్యాటింగ్ తో రాణిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు టాప్ స్కోరర్ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. బౌలర్లలో విషయానికొస్తే సౌమ్య పాండే ప్రత్యర్థులను బెంబేలెత్తించే బౌలింగ్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. యువ టీమిండియాకు ఈ ముగ్గురు కీలకంగా ఉన్నారు. అటు ఆస్ట్రేలియా కూడా అల్ రౌండ్ ప్రదర్శనతో ఫుల్ ఫామ్ లో ఉంది.

ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మద్య రసవత్తరమైన పోరు నడిచే అవకాశం ఉంది. ఇప్పటివరకు అండర్ 19 విభాగంలో భారత్ ఆరు సార్లు ఫైనల్ కు చేరింది. భారత్ ఆస్ట్రేలియా జట్లు రెండు సార్లు ఫైనల్స్ లో తలపడగా యువ టీమిండియానే పై చేయి సాధించింది. ఇప్పుడు మూడో సారి తలపడుతుండగా.. ఈసారి కూడా విజయం సాధించాలని టీమిండియా యువ జట్టు భావిస్తోంది. పైగా సీనియర్స్ విభాగంలో జరిగిన వరల్డ్ కప్ లో ఆసీస్ చేతిలోనే టీమిండియా ఓటమి చవిచూసింది. దాంతో సీనియర్స్ ఓటమికి జూనియర్స్ ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంటారేమో చూడాలి.

Also Read:Pawan:పవన్ ‘ వీరమల్లు ‘ సంగతేంటి?

- Advertisement -