కాల్‌సెంటర్ కేంద్రంగా దోపిడి…

336
- Advertisement -

కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. వాటి నుంచి అమెరికాలోని కొందరికి ఫోన్లు చేశారు. ‘మీరు ఆదాయ పన్ను సరిగా కట్టలేదు. ఇంకా పన్ను కట్టాల్సి ఉంది. ఇప్పటికే మీపై అరెస్టు వారెంటు జారీ అయింది. వెంటనే పన్ను కట్టేయకపోతే, పోలీసులు వచ్చేస్తారు. మీరు పన్ను కట్టాలనుకుంటే, ఫలానా అకౌంట్లో నగదు జమ చేయండి. లేదా మనీ ఆర్డర్‌ పంపండి’ అని చెప్పారు. దాంతో, భయపడిపోయిన వారంతా ఆయా అకౌంట్లలో నగదు జమ చేశారు. ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) పేరిట భారత, అమెరికాల్లో కలిపి చేసిన ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దోచేశారు. భారతలోని కాల్‌ సెంటర్ల నుంచి కాల్స్‌ చేశారు. అమెరికాలో వసూళ్లు జరిపారు. ఆ డబ్బులను తిరిగి భారతకు తరలించారు. ఈ స్కాంలో థానే, అహ్మదాబాద్‌ల్లోని దాదాపు పదికిపైగా కాల్‌ సెంటర్లు పాల్పంచుకున్నాయి. ఇప్పుడు ఈ కుంభకోణంపై ఇండియాలోనూ, అమెరికాలోనూ ఏకకాలంలో విచారణ జరుగుతోంది.

online news portal

మన దేశంలో ఇప్పటికే 70 మందిని అరెస్టు చేయగా, అమెరికాలో హైదరాబాదీ భోగవల్లి నరసింహ సహా 61 మందిని అరెస్టు చేశారు. ఈ మొత్తం కుంభకోణానికి అహ్మదాబాద్‌కు చెందిన సాగర్‌ ఠక్కర్‌ అలియాస్‌ షాగీ ప్రధాన సూత్రధారి అనుమానిస్తున్నారు. ఇక, ఇదే స్కాంకు సంబంధించి అమెరికాలోని తెలుగు వ్యాపారి భోగవల్లి నరసింహారావును ఎఫ్‌బీఐ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కలిసి అమెరికాలోని 15 వేల మందిని మోసం చేశారని, వారి నుంచి దాదాపు రూ.2000 కోట్లను వసూలు చేశారని ఎఫ్‌బీఐ పోలీసులు స్పష్టం చేశారు.

online news portal
ఐఆర్ఎస్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మన దేశంలో ఆదాయ పన్ను విభాగం తరహాలోనే అమెరికాలో ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) ఉంది. పౌరుల నుంచి ఆదాయ పన్ను వసూలు చేసే బాధ్యతను అది భారతలోని కొన్ని కాల్‌ సెంటర్లకు ఔట్‌సోర్స్‌ చేసింది. వారి పని, భారతలోని కాల్‌ సెంటర్ల నుంచి అమెరికాలోని ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఫోన్‌ చేయడం. వారు పన్ను చెల్లించేలా చేయడం. కానీ, ఈ కాంటాక్టు తీసుకున్న వారు తాము ఔట్‌సోర్సింగ్‌ తీసుకున్న కాంటాక్టును దుర్వినియోగం చేశారు.
online news portal
అహ్మదాబాద్‌లో సాగర్‌ ఠక్కర్‌ తరహాలోనే ఐఆర్‌ఎస్‌ ఏజెంట్లమని చెబుతూ అమెరికాలో కాల్‌ సెంటర్‌ స్కాంకు పాల్పడిన హైదరాబాదీ భోగవల్లి నరసింహారావును ఎఫ్‌బీఐ పోలీసులు అరెస్టు చేశారు. డాల్‌సలో ఉండే నరసింహారావు అక్కడే టచ్‌స్టోన్‌ కమోడిటీస్‌, టెక్‌ డైనమిక్స్‌ అనే కంపెనీలను ఏర్పాటు చేశాడు. టెక్‌ డైనమిక్స్‌లో అమెరికా నిరుద్యోగ యువతను ఉద్యోగంలో తీసుకున్నాడు. ఇండియాలో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసి వారితో అమెరికాలోని పన్ను చెల్లింపుదారులకు ఫోన్లు చేయించేవాడు. ఇలా నరసింహారావు రూ.500 కోట్లను అమెరికా ఆదాయపన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేసినట్లు ఎఫ్‌బీఐ గుర్తించింది. నరసింహారావు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ విద్యార్థి.

online news portal

భారతలో కాల్‌ సెంటర్‌ స్కాంకు అహ్మదాబాద్‌కు చెందిన 23 ఏళ్ల సాగర్‌ ఠక్కర్‌ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. తొలుత, ఇతడు ఇంటర్నెట్లో వివిధ మార్గాల్లో డాటాను దొంగిలించేవాడు. దానిని, వివిధ కంపెనీలకు అమ్మేవాడు. దాంతో అతనికి పెద్దఎత్తున డబ్బులు కూడా వచ్చేవి. ఆ అనుభవంతో అతనే స్వయంగా అహ్మదాబాద్‌లో రెండు కాల్‌ సెంటర్లు ఏర్పాటుచేశాడు. ఐఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన సమాచారం, తాను దొంగిలించిన సమాచారం ఆధారంగా అమెరికాలోని పలువురికి ఫోన్లు చేయించేవాడు. వారంతా సాగర్‌ ఆపరేట్‌ చేసే అకౌంట్లలో డబ్బులు జమ చేసేవారు. ఈ విధంగా సాగర్‌ రోజుకు రెండు కోట్ల రూపాయల వరకూ సంపాదించేవాడని సమాచారం. దాంతో, తినడానికి తిండి కూడా లేని సాగర్‌.. ఏడాది కాలంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్‌ ఆడి కార్లలో బాడీగార్డులను వేసుకుని తిరగడం ప్రారంభించాడు. ఐఆర్‌ఎస్‌ స్కాం వెలుగులోకి రావడంతో సాగర్‌, అతని సోదరి పరారీలో ఉన్నారు.

- Advertisement -