టైసన్ నాయుడు..త్వరలో రిలీజ్!

1
- Advertisement -

ప్రామిసింగ్ స్టార్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైసన్ నాయుడు’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ మునుపెన్నడూ చూడని మాస్ మేకోవర్‌తో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టైటిల్, గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ఎనర్జిటిక్‌గా ప్రారంభిస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ను విడుదల చేశారు.

భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట ఇన్ఫెక్షియస్ రిథమ్స్, ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్, ఇన్‌స్టంట్ మాస్ అప్పీల్‌తో ఆకట్టుకునే ఫోక్ నంబర్‌గా నిలిచింది. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే ఫోక్ కంపోజిషన్స్, మాస్ నంబర్స్ అందించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో.. ఆకట్టుకునేలా ఈ ఫోక్ బ్యాంగర్‌ను రూపొందించారు. డైనమిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఉర్రూతలూగించే మ్యూజిక్ అరేంజ్‌మెంట్స్, హై ఎనర్జీ కంపోజిషన్ ఈ పాటకు అదిరిపోయే సెలబ్రేషన్ వైబ్‌ను తీసుకొచ్చాయి.

సురేష్ గంగుల అందించిన లిరిక్స్ పాటకు ఎంటర్‌టైనింగ్ మాస్ ఫ్లేవర్‌ను జోడించాయి. హీరో, హీరోయిన్ మధ్య సరదాగా సాగే రొమాంటిక్ సంభాషణలను తన పదాలతో అందంగా ఆవిష్కరించారు. హీరో తన ప్రేమను ‘మదరాసి రబ్బరు బొమ్మ’ అంటూ ముద్దుగా పిలుస్తూ ఆమెను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకు అమ్మాయి కూడా అంతే చమత్కారంగా సమాధానమిస్తూ వారి మధ్య మ్యూజికల్ బాంటర్‌ను మరింత సరదాగా మార్చింది. నల్గొండ గద్దర్ నర్సన్న, రోహిణి సొరట్ తమ పవర్‌ఫుల్ వాయిస్‌తో పాటకు అద్భుతమైన ఎనర్జీని అందించారు.

పాట విజువల్స్ కూడా ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి ఆకట్టుకునే ఫోక్ ఇన్‌స్పైర్డ్ కాస్ట్యూమ్స్‌లో కనిపించారు. సాయి శ్రీనివాస్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకోగా, నేహా శెట్టి కూడా ఆకట్టుకునే స్టెప్పులేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, లైవ్లీ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను మంచి విజువల్ ట్రీట్‌గా మార్చాయి. విజయ్ పోలాకి అందించిన కొరియోగ్రఫీ ప్రత్యేకంగా ఉంది. ఎనర్జిటిక్ మూవ్‌మెంట్స్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్, వైబ్రెంట్ సెట్స్ పాటలోని పండుగ వాతావరణాన్ని మరింత పెంచాయి.

- Advertisement -