బిగ్ బాస్ హౌస్‌లోకి టైసన్!

2
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. దేశంలోని పలు భాషల్లో వచ్చిన ఈ షోకు మంచి స్పందన వచ్చింది. తెలుగులో 9వ సీజన్ త్వరలో ప్రారంభంకానుండగా హిందీలో ఇప్పటికే 18 సీజన్లు పూర్తి చేసుకుంది.

ఆగ‌స్టు 24 నుంచి బిగ్ బాస్ 19వ సీజన్ ప్రారంభంకానుండగా ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సీజ‌న్‌లో మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్‌, డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ అండ‌ర్‌టేక‌ర్‌లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వ‌నున్నారట.

ఈ సీజన్‌లో గౌర‌వ్ ఖ‌న్నా, అఘ్నార్ కౌర్‌, అవేజ్ ద‌ర్బార్, న‌గ్మా మిరాజ్‌క‌ర్‌, బ‌సీర్ అలీ, అభిషేక్ బ‌జాబ్‌, హునార్ హేల్‌, సివేట్ తోమ‌ర్‌, ఖాస్క్ వాఘ్నాని, గేమ‌ర్ పాయ‌ల్ ధ‌రే, జీష‌న్ క్వాద్రీ త‌దిత‌రులు పాల్గొనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జియో హాట్‌స్టార్‌లో రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం చేస్తారు. ఒక వేళ టైసన్, అండర్ టేకర్ పాల్గొంటే ఖచ్చితంగా మరింత ఆదరణ వస్తుందనే చెప్పాలి.

Also Read:గోవిందరాజస్వామి ఆల‌యంలో పవిత్రోత్సవాలు

- Advertisement -