పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం సలార్. సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్ సినిమా థియేటర్లలో విడుదలై నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే అతిపెద్ద సినిమాగా నిలిచింది. విడుదలై రెండేళ్లు గడిచినా ఇప్పటికీ ఈ సినిమాపై అభిమానుల్లో, సెలబ్రిటీల్లో చర్చ కొనసాగుతుండటం విశేషం.
సినిమా రెండో వార్షికోత్సవం సందర్భంగా సలార్ 2పై ఆసక్తి మరోసారి పెరిగింది. అయితే సీక్వెల్ గురించి స్పష్టత కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిర్మాతలు ఈ విషయంలో పూర్తిగా మౌనం పాటిస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉండగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్‌తో రూపొందుతున్న చిత్రంపై పూర్తి దృష్టి పెట్టారు. ఈ కారణంగా సలార్ 2 త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందనున్న సలార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

