రోడ్డుపైనే కొట్టుకున్న టీడీపీ నేతలు..

248
tdp
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌ అధికార పార్టీ టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో టీడీపీ రెండుగా చీలిపోయింది. ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వ విప్ పల్లె రఘునాథరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని టీడీపీ ఓ వర్గం నేతలు ఈ రోజు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పల్లె రఘునాథరెడ్డి వర్గీయులు ఘటనాస్థలికి చేరుకొని అందోళనకు దిగారు.

tdp

ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఘర్షణకు మొదలైంది. ఇరువర్గాలు కాలర్లు పట్టుకుని కొట్టుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింజేశారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు సూచించారు. కానీ ఆ రెండు వర్గాలు అందుకు అంగీకరించకపోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. అధిపత్యపోరుతో టీడీపీలో లుకలుకలు వీధికెక్కాయి. అసమ్మతి నేతలు వీధులకు ఎక్కి గోల చేయవద్దని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సూచించినప్పటికీ పార్టీ శ్రేణులు మాత్రం వర్గాలుగా చీలిపోయి రోడ్లపైనే తన్నుకుంటూ పార్టీ పరువు తీస్తున్నారు.

ఈ పరిణామాలు కచ్చితంగా పార్టీపై ప్రభావం చూపుతాయని టీడీపీ నాయకులు భయపడుతున్నారు. ఇటీవల తాడిపత్రి.. రాయదుర్గం.. కళ్యాణదుర్గం.. తాజాగా అనంతపురం.. ఇలా ఒక్కొక్కరుగా సిట్టింగ్‌లతో పాటు అధిష్టానానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతతో పలు జిల్లాలో పార్టీ పరిస్థితి దిగజారిన వేళ.. అసమ్మతి సెగ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా టీడీపీకి చెందిన ముఖ్య నేతలు ఏపీలో వైసీపీకి.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం కష్టంగానే కనిపిస్తోంది.

- Advertisement -