త్వరలో రెండు భారీ ఫైఓవర్లు..

184
Two elevated flyovers soon in hyd
- Advertisement -

ఉప్పల్ నుంచి హైదరాబాద్ ప్రధాన నగరానికి సలువుగా చేరుకునేలా వీలు కల్పించే రెండు ప్రధాన ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంబర్ పేట ఫ్లై ఓవర్ తో పాటు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని జిహెచ్ఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం భూసేకరణ చట్టానికి ఉన్న అడ్డంకులు తొలగడంతో ఈ రెండు ప్రాజెక్టుల భూసేకరణను రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే జిహెచ్ఎంసి భూసేకరణ నోటీసులు కూడా జారీ చేసిందని తెలిపారు. సుమారు 960 కోట్ల రూపాయలతో ఉప్పల్ నుంచి నందనవనం భాగ్యనగర్ వరకు 6.4 కిలోమీటర్లతో ఈ ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించనున్నారు.

traffic

ఉప్పల్ నుంచి ప్రధాన నగరానికి ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా వచ్చేందుకు వీలుగా నాలుగు లైన్లతో నిర్మించే ఈ ఎలివేటెడ్ కారిడార్ కు జాతీయ ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. 950 కోట్ల లో 330 కోట్లు భూసేకరణ కోసం కేటాయించారని, మిగతాది ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ ప్రాజెక్టు అలైన్ మెంట్కు అమోదం లభించిందని, డిపీఆర్ రెడీ అయిందని, 17 తారీఖు ఢిల్లీ కి రాష్ర్టప్రభుత్వాధికారులు వెళుతున్నారని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టును వచ్చే 24 నెలల్లోనే పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. మరోపైపు అబంర్ పేట్ ప్లైఓవర్ కోసం మెత్తం 243 కోట్ల పనులకు కేటాయింపులు వచ్చాయని తెలిపారు. ఇందులో 130 కోట్లు భూసేకరణకు కేటాయింపులు జరిగినట్టు మిగితా 110 కోట్లు ప్రాజెక్టు ఖర్చు ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో గోల్నాక నుంచి రామాంతాపూర్ వరకు ఫ్లై ఓవర్ 1.4 కిలోమీటర్లు ప్లై ఓవర్ నిర్మాణానికి జిహెచ్ ఎంసీ నే భూసేకరణ చేస్తుందని తెలిపిన మంత్రి త్వరలోనే ఈ భూసేకరణ పూర్తయితుందని, అ తదుపరి వేంటనే టెండర్లు పిలుస్తామని మంత్రి తెలిపారు.

ఈ ప్రాజెక్టుల అమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫోన్ చేసి పలుమార్లు విజ్ఞప్తి చేశారని, మొన్న మే 1 వ తారీఖును ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ, జాతీయ రహదారుల అధికారులతో ఢిల్లీలో గడ్కరీతో సమావేశమయ్యామని మంత్రి తెలిపారు. మెదట వరంగల్ హైదరాబాద్ రోడ్డు కనెక్టీవీటీపైన ట్రాఫిక్ స్టడీస్ నిర్వహించామన్నారు. ఈ మేరకు నగరానికి ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను, అవసరాన్ని కేంద్రానికి వివరించామని మంత్రి తెలిపారు. మరోవైపు అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రాజెక్టు ఇది చాలా ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం అయిందని, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో, నిరంతర సంప్రదింపులతో ఈ ప్రాజెక్టులకు మెక్షం లభించిందన్నారు. భూసేకరణకు అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు రాష్ర్టప్రభుత్వం సిధ్దంగా ఉన్నదని తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -