- Advertisement -
రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అకడకడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరంలో కొనసాగుతున్నదని తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నదని తెలిపింది.
ఫలితంగా ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోని పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. పశ్చిమ దిశగా ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నదని తెలిపింది.
- Advertisement -