నేడు, రేపు తెలంగాణలో వర్షాలు..

220
imd rains

తెలంగాణలోని పలు చోట్ల నేడు,రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురవగా సోమ,మంగళవారాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

నైరుతి మధ్యప్రదేశ్‌, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌లో నాలుగు రోజులు వర్షాలు కురవొచ్చని చెప్పారు.

మరోవైపు, రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలలోపే నమోదవుతున్నాయి.