TG:రెండు రోజులు భారీ వర్షాలు

6
- Advertisement -

నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట్, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.

ఈ మేరకు ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు.

రాష్ట్రంలో గంటకు 30-49 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వాయుగుండం తీరం దాటడంతో ఏపీకి ముప్పు తప్పింది. దక్షిణ ఒడిశా-గోపాల్‌పూర్‌ వద్ద తీరం దాటింది వాయుగుండం.పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్‌ వైపు కదిలి బలహీనపడనుంది వాయుగుండం.

Also Read:TG:స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు

- Advertisement -