Twitter:ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం

40
- Advertisement -

ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ నిబంధనలను ఉల్లంఘించే ట్వీట్లను ఎక్కువ మందికి చేరకుండా మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ యూజర్లకు వాక్ స్వేచ్ఛ ఉంటుంది కానీ, వారి ట్వీట్లు ఎవరికి, ఎంత మందికి చేరాలనే విషయంలో స్వేచ్ఛ ఉండదని స్పష్టం చేసింది.

Also Read:కర్నాటకలో ఫ్యామిలీ పాలిటిక్స్ !

ఈ కొత్త నిబంధనలు ముందుగా విద్వేషపూరితంగా ఉండే ట్వీట్లపై అమలు చేయనున్నట్లు వెల్లడించింది. తర్వాత క్రమంగా ఇతర కేటగిరీలకు అమలు చేస్తామని వెల్లడించింది. పాలసీని ఉల్లంఘిస్తే ఆ ట్వీట్ల నుంచి మిగిలిన యూజర్లను రక్షించడం తమ బాధ్యతగా పేర్కొంది. విజిబిలిటీ ఫిల్టరింగ్ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.ఈ నిర్ణయం తప్పని భావించేవారు తమ అభిప్రాయాన్ని కంపెనీకు తెలియజేసే అవకాశం కల్పిస్తామని పేర్కొంది.

ట్విట్టర్‌ ను కొనుగోలు చేసినప్పటి నుండి సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు మస్క్. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికి అంతుబట్టడం లేదు.

Also Read:పవన్ ను భయపెడుతున్న సెంటిమెంట్ ?

- Advertisement -