ట్విట్టర్..ఫేక్ అకౌంట్స్ తొలగింపు

524
Twitter
- Advertisement -

అసత్య వార్తలు ప్రచారం చేసే వారిపై కొరడా ఝళిపించింది ట్విట్టర్. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న అనుమానాస్పద అకౌంట్లను తొలగించింది. హాంకాంగ్ నిరసనకారులపై వార్తలు ప్రచారం చేస్తున్న 10 వేల ఖాతాలను తొలగించినట్లు ట్విట్టర్ సంస్థ ప్రకటించింది.

గత ఆగస్టులో కూడా ట్విట్టర్ హాంకాంగ్‌లో నిరసనలకు ఆజ్య పోస్తున్న 2 లక్షల ఖాతాలను తొలగించగా తాజాగా తొలగించిన అకౌంట్స్ చైనాకు చెందినవిగా భావిస్తున్నామని ట్విట్టర్ తెలిపింది.

ట్విట్టర్‌ని ఉపయోగించి ప్రజలపై ఏ విధంగా ప్రభావం చూపగలుగుతున్నారో తెలుసుకొనే పనిలో భాగంగా కంపెనీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ట్విట్టర్ తొలగించిన అకౌంట్లలో యుఏఈ,చైనా,స్పెయిన్‌కి చెందినవి ఎక్కువగా ఉన్నాయి.

ఇటీవల మన భారత్‌కి సంబంధించిన పలు పార్టీలకు సంబంధించి ఫేక్ అకౌంట్లను గుర్తించి తొలగించిన విషయం తెలిసిందే. అయితే కేవలం ట్విట్టర్‌ మాత్రమే కాదు.. మరో ప్రముఖ సామాజిక మాధ్యమమైన ఫేస్‌బుక్ కూడా భారీ ప్రక్షాళనకు సిద్ధమైంది. ఇప్పటికే పలు దేశాలకు సంబంధించిన ఫేక్ అకౌంట్లను డిలీట్ చేసింది.

- Advertisement -