పేరు చివర ఖాన్‌ ఉంది కాబట్టే…

194
- Advertisement -

పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఖవాజా అసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ను దోషిగా తేల్చిన జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు తీర్పును తప్పుబట్టారు.

భారత్‌లో మైనారిటీలపై వివక్షత ఉంటుందని, వారికి భారత్‌ లో రక్షణ ఉండదని మరోసారి జురువైందని సంచలన కామెంట్స్‌ చేశారు అసిఫ్. సల్మాన్‌ పేరు చివర ఖాన్‌ లేకుంటే తీర్పు వేరేలా వచ్చేదని వ్యాఖ్యానించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కోర్టు తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా.. భారత్‌లోని అధికార పార్టీ మతాన్ని
సల్మాన్ కలిగి ఉంటే ఈ శిక్షకు సల్మాన్‌ అనర్హుడై ఉండేవాడని ఆరోపించారు.

Twitter Blasts Pak Minister Khwaja Asif After He Says Salman Khan అయితే అసిఫ్‌ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికాగా నెటిజన్లు తమ ఆవేషాన్ని వెల్లగక్కారు. పాక్‌ మంత్రి పై తీవ్ర స్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించారు. సల్మాన్ ఖాన్‌, అతని మతంపై అంత ప్రేమ ఉంటే..ఆ హీరో సినిమాలు(ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందాహై) పాక్‌లోని థియేటర్లలో ఎందుకు ఆడనివ్వలేదని అసిఫ్‌ ని ప్రశ్నించారు. ఇదే కేసులో నిర్థోషిగా బయటపడ్డ సైఫ్‌ అలీఖాన్‌ది ఏ మతమో మంత్రి చెప్పాలంటూ కూడా మరొకరు ప్రశ్నించారు.

భారత్‌ లో అందరూ సమానమేనని, అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ను శిక్షించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. అసిఫ్‌ పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడని, ముందు పాక్‌ లో ఉన్న సమస్యలను తీర్చిన తర్వాతే పక్క దేశాల గురించి ఆలోచించండి అంటూ పాక్‌ మంత్రికి సలహాలు కూడా ఇస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -