ట్విట్టర్ (X) సేవలకు అంతరాయం..

35
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలు స్తంభించాయి. గురువారం ఉదయం ట్విట్టర్ మొరాయించింది. నెటిజన్లకు సేవలు అందించంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్‌ తో సహా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ లో సమస్య తలెత్తింది.

ట్విట్టర్.. ఎక్స్‌ అకౌంట్స్ ఓపెన్ చేయగానే టైమ్‌లైన్‌ ఖాళీగా కన్పించింది. ఈ విషయంపై యూజర్లు ఫిర్యాదులు చేశారు. పెట్టిన పోస్టులు కన్పించడం లేదని తెలిపారు. ఫాలోయింగ్‌, ఫర్‌ యూ, లిస్ట్‌ పేజీలు కూడా ఖాళీగా దర్శన మిచ్చాయి. ఎక్స్‌ ప్రీమియం, ఎక్స్‌ ప్రో వెర్షన్‌లు కూడా పని చేయడం లేదని అనేక మంది ఇతర సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

ఇటీవల మాధ్యమంలో అనేక సమస్యలు తలెత్తాయి. తగినంత మంది సిబ్బంది లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఇతర సాంకేతిక కారణాలు ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో ట్విటర్‌ సేవల్లో చాలా సార్లు అంతరాయం కలుగుతోందని టెక్‌ వర్గాలు అంటున్నాయి.

Also Read:ప్చ్..ప్రియాంక డ్రెస్ అంత రేటా?

- Advertisement -