భర్త కోసం ఉపవాసం అవసరం లేదు-ట్వింకిల్‌

195
- Advertisement -

‘కర్వా చౌత్‌’ పర్వదినాన్ని పురస్కరించుకుని బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేసింది. ఉత్తరాది మహిళలు తమ భర్తలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కర్వాచౌత్ పర్వదిన నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉపవాసం ఆచరించి, చంద్రోదయం తరువాత భర్త ముఖాన్ని జెల్లెడ చాటున చూసిన తరువాత కానీ ఎంగిలిపడరు. దీనిపై ఆమె వ్యంగ్యంగా ట్వీట్ పెట్టారు.ఈ ట్వీట్‌ ఆలోచనరేకెత్తించేలా, నవ్వుతెప్పించేలా ఆసక్తిగా ఉంది.

Twinkle Khanna Tweet About Karva Chauth

భర్తలు బాగుండాలంటే వారి జీర్ణప్రక్రియ బాగుండాలని సూచించారు. అలా ఉండాలంటే భార్యలు ఉపవాసం చేస్తే సరిపోదని అన్నారు. అంతెందుకు భూమిమీద ఎక్కువ కాలం బతికి ఉన్న జంతువులపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వాటి జీర్ణక్రియ బాగుండడమేనని తేల్చిచెప్పారని ఆమె గుర్తు చేశారు. అంతే కానీ వాటి భార్యలు కర్వాచౌత్ ఉపవాసం ఉండడం వల్ల అవి ఎక్కువ కాలం బతికి ఉండలేదని ఆమె స్పష్టం చేసింది. గతేడాది కర్వాచౌత్ సందర్భంగా ‘ఈ కాలంలో 40 ఏళ్లు దాటగానే చాలామంది మగవారు రెండో పెళ్లి చేసేసుకుంటున్నారు. అలాంటివారి కోసం భార్యలు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు’ అంటూ ట్వీట్‌ చేశారు. తాజాగా ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

- Advertisement -