ఎమ్మెల్సీ కవితను కలిసిన టీవీజీఏ సంఘం నాయకులు..

106
mlc kavitha
- Advertisement -

తెలంగాణ వెటర్నరీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ (టీవీజీఏ) అధ్యక్షుడు డాక్టర్ కాటం శ్రీధర్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత కలిశారు. ఆమెను కలిసిన వారిలో వెటర్నరీ వైద్యులు అనిల్ రెడ్డి, రాజేందర్, సయ్యద్, రాకేశ్‌, రమేశ్‌, నరేశ్‌, యాదగిరి, భాను కిరణ్ తదితరులు ఉన్నారు.

పశుసంవర్థక శాఖలోని వెటర్నరీ వైద్యుల పోస్టులను శాఖాపరంగా భర్తీ చేసేలా చొరవ తీసుకోవాలని వారు కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి శాఖపరంగా వెటర్నరీ వైద్యుల పోస్టులు భర్తీ చేసేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

- Advertisement -