రవిప్రకాష్‌-శివాజీల అరెస్టుకు రంగం సిద్ధం..

288
- Advertisement -

టీవీ9 మాజీ సిఇఓ రవిప్రకాష్‌పై లోగో అమ్మడంటూ బంజారా హిల్స్ లో మ‌రో కేసు నమోదు అయింది. చానల్‌ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారనే ఆరోపణపై ఈ కేసు నమోదైంది. టీవీ9 తెలుగు లోగోతో పాటు మొత్తం ఆరు లోగోలను ఆయన సొంత వెబ్‌చానల్‌ మోజోటీవీకి దొంగచాటుగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు.

రవిప్రకాశ్‌పై కంపెనీ ఫోర్జరీ కేసు, నిధుల మళ్లింపు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక మరో వైపు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిప్రకాష్ మరియు శివాజీల కోసం ప్రత్యేకమైన టీం లను ఫామ్ చేస్తున్నట్టు సమాచారం. 41ఏ నోటీసులు స్పందించపోవడంతో విషయాన్ని లీగల్ ఒపీనియన్ కు పంపి రేపటి నుండి టీం లను ఫామ్ చేసి రవిప్రకాష్,శివాజీల కోసం గాలింపు చేపట్ట వచ్చని తెలుస్తోంది.

Ravi Prakash

వీరు కోర్టుకు వెళ్లినా కూడా విచారణకు కచ్చితంగా హాజరు కమ్మని కొర్టు చెప్పే అవకాశం ఉంది. బంజారాహిల్స్ లో కూడా కేసు నమోదు అయింది కాబట్టి సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో శివాజి, రవిప్రకాశ్ అరెస్ట్ కు రంగాం సిద్ధం చేస్తున్నాట్టు సమాచారం. ఈ రెండు కేసుల నేపధ్యంలో రెండు కమిషనరేట్లు హైదరాబాద్ మరియు సైబరాబాద్ సిపి లు ఎం చెయ్యాలి అన్న విషయం పై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఇక ఈ నెల 15 తేదీన‌ రవిప్రకాష్ లంచ్ మోషన్ పిటీష‌న్‌ కొట్టి వేసినప్పుడు ఒక వేళ అరెస్ట్ చేసారు అనుకుంటే.. నిందితులు మల్లి కోర్ట్ ను ఆశ్రయించవచ్చు అని తెలపడంతో రవిప్రకాష్,శివాజీలు నాట్ టు అరెస్టు పిటిషన్ ను కోర్ట్ కొట్టివేసే అవకాశం ఉన్న నేపద్యంలో లీగల్ గా ఏవిధంగా వెళ్ళాలి అన్న విషయంపై కూడా సైబరాబాద్ లీగల్ టిం ఒక నిర్ణయానికి వచ్చునట్టు తెలుస్తోంది.

- Advertisement -