తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఇందులో భాగాంగా తాజాగా ఈ ఛాలెంజ్‌ని శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాశ్ రెడ్డి టీవీ9 రజినీకాంత్‌కు విసరగా.. ఆయన స్వీకరించి తన నివాసంలో మొక్కలు నాట్టారు. అలాగే ఆయన మరో నాలుగురికి ఈ సవాల్‌ను విసిరుతూ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి,టీఆర్‌ఎస్ క్రాంతి కిరణ్,రాజ్‌దీప్ సర్దేశాయ్, ఆర్‌జీవీ లకు ఈ ఛాలెంజ్ విసిరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని టీవీ9 రజినీకాంత్ కోరారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కు అభినందనలు తెలుపుతూ.. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిదని ఆయన తెలిపారు. అలాగే మెరుగైన సమాజం కోసం గ్రీన్ దీపావళీ జరుపుకోవాలని రజనీకాంత్ కోరారు.
దీనికి ఎంపీ సంతోష్ స్పందిస్తూ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు టీవీ9 రజినీకాంత్‌కు ధన్యవాదాలు.. ఈ మంచి కారణాన్ని ప్రచారం చేయడంలో మీడియా సోదరుల యొక్క మద్దతు ఎంతో అవసరని ఎంపీ సంతోష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
I have accepted #GreenIndiaChallenge from @dcpshmbad_cyb n planted 3 saplings, now I invite @TelanganaDGP, @KrantiKiranTRS, @sardesairajdeep and @RGVzoomin 2 continue n Appreciate @MPsantoshtrs for this great initiative n we are also taking forward #GreenDiwali for better society pic.twitter.com/dj7SIuoGn0
— Rajinikanth Vellalacheruvu (@rajinikanthlive) October 21, 2019
Thank you @RajinikanthV9 for bracing the initiative. Need the support of the Press fraternity in propagating the good cause. #GreenIndiaChallenge 🌱🌳. https://t.co/xBzOZvfqPV
— Santosh Kumar J (@MPsantoshtrs) October 21, 2019