రవిప్రకాశ్‌కు హైకోర్టులో మరోసారి షాక్‌..

147
TV9 EX CEO Ravi Prakash

టీవీ9 మాజీ సీఇఓ రవిప్రకాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రవిప్రకాశ్‌ వాట్సాప్‌ కాల్‌లో అందుబాటులో ఉంటున్నా.. విచారణకు పోలీసుల ఎదుట మాత్రం హాజరు కావడం లేదని.. ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. పోలీసులు విచారణకు హాజరుకావాలని రెండు సార్లు 160 సీఆర్‌పీసీ నోటీసులిచ్చినా రవిప్రకాశ్ స్పందించలేదని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.

160 సీఆర్‌పీసీ నోటీసులకు స్పందించకుంటే 41ఏ నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. అయితే రవిప్రకాశ్ తరుపు న్యాయవాది మాత్రం ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానంలో వాదించారు.