కొంచెం టచ్‌లో కూడా లేడు..

234
TV anchor Pradeep skips counselling session
- Advertisement -

డిసెంబర్ 31 రాత్రి పోలీసులు జరిపిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యాంకర్, నటుడు మాచిరాజు ప్రదీప్ (35) ప్రస్తుతం పరారీలో ఉన్నాడని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.  2వ తేదీన ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటరుకు తల్లి లేదా భార్య లేదా సమీప బంధువుతో సహా కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సి ఉన్నా, ప్రదీప్ రాలేదని తెలిపారు.

ప్రదీప్ కార్యాలయం కూకట్ పల్లిలో ఉందని గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా వెళ్లారని, ఆయన ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు అందించిన రిపోర్టులో ఫిర్యాదు చేశామని, గురువారం కూడా ప్రదీప్ కౌన్సెలింగ్ కు రాకపోతే లా అండ్ ఆర్డర్ పోలీసులకు విషయం తెలియజేస్తామని, తదుపరి చర్యలను వారే తీసుకుంటారని ట్రాఫిక్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

కౌన్సెలింగ్‌కు హాజరైతే.. తాగి నడపడం వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి అతనికి వివరించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. అనంతరం కోర్టులో ప్రవేశపెడతామని, మద్యం సేవించిన స్థాయిని బట్టి జరిమానా లేదా ఒకటి రెండు రోజులు జైలుశిక్ష పడే అవకాశముందని వివరించారు.

- Advertisement -