భార్య ఆత్మహత్య కేసులో ప్రముఖ నటుడి అరెస్టు..!

774
actor madhu prakash
- Advertisement -

సీరియల్‌ నటుడు మధు ప్రకాష్ సతీమణి భారతి సూసైడ్ చేసుకున్న వైనం సంచలనంగా మారింది. ఆమె ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధుప్రకాష్‌ ను పోలీసులు అరెస్టు చేశారు.భారతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతన్ని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు.

అదనపు వరకట్నం వేధింపుల కేసు కింద మధుప్రకాష్‌ను అరెస్టు చేసినట్టు పోలీసుల సమాచారం. భారతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికీ పోలీసులు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుంకుమపువ్వు సీరియల్ లో కథానాయకుడిగా.. బాహుబలి చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించిన మధు సుపరిచితుడే.

- Advertisement -