మహిళల భద్రత కోసం ‘ట్యూటెమ్’ యాప్

9
- Advertisement -

మహిళా భద్రతే ప్రాధాన్యతగా ‘ట్యూటెమ్’ యాప్ తీసుకురానున్నట్లు వెల్లడించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. చిట్టచివరి గమ్యస్థానం వరకు మెట్రోలో సురక్షిత ప్రయాణం చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు సురక్షితమైన రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు అన్నారు.

ప్రజల భద్రత విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు సాకారం చేసే దిశగా మెట్రో రైల్ అడుగులు వేస్తుందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో రైల్, హైదరాబాద్ పోలీస్ సహకారంతో బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్, ఐఐటీ ఖరగ్ పూర్, ఐఐటీ బొంబాయి సంయుక్తంగా ఏడీబీ ఆర్థిక సహాయంతో ట్యూటెమ్ (టెక్నాలజీస్ ఫర్ అర్బన్ ట్రాన్సిట్ టు ఎన్హాన్స్ మొబిలిటీ అండ్ సేఫ్ యాక్సెసిబిలిటీ – TUTEM) అనే ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

Also Read:ఢిల్లీ మెట్రో..వైరల్ వీడియో

- Advertisement -