- Advertisement -
టర్కీని భారీ భూకంపం కుదిపేసింది. ఇవాళ ఉదయం 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూమి కంపించగా రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదుకాగా దాదాపు 95 మంది మృతిచెందారు.
భూమిలోపల 17.9 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చిందని తెలిపింది. భారీ భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావతంతో లెబనాన్, సిరియా, సైప్రస్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. సిరియాలోని పశ్చిమ తీరప్రాంతమైన లటకియాలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి.
ఇవి కూడా చదవండి..
- Advertisement -