నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై తుంగ బాలు ఫైర్

1
- Advertisement -

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటన అత్యంత దురదృష్టకరమని బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు తీవ్రంగా ఖండించారు.

విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతుంటే, ప్రశ్నాపత్రాలు లీక్ అవడం వల్ల వారి శ్రమ వృథా అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి, లీకేజీలు వరుసగా జరుగుతున్నాయని విమర్శించారు.NEET మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక పోటీ పరీక్షల్లో పేపర్ లీకులు చోటుచేసుకోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.పేపర్ లీక్‌కు పాల్పడిన దొంగలను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఈ వ్యవహారంలో ఉన్న పెద్దల పాత్రను కూడా బయటపెట్టాలని తుంగ బాలు డిమాండ్ చేశారు.

పేపర్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమొస్తామని పిలుపునిచ్చారు.

విద్యార్థుల ఆశలు, తల్లిదండ్రుల నమ్మకాన్ని దెబ్బతీసే ఈ ఘటనలపై దేశ ప్రజలు ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు.విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని వారికి బిఆర్ఎస్వి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

Also Read:‘వీరభద్రుడు’..థియేటర్‌లోనే చూడాలి!

- Advertisement -