ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేదు:తుమ్మల

8
- Advertisement -

ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సన్న ధాన్యం పండించిన ప్రతి రైతుకు ₹500 లు బోనస్ ఇస్తాం…పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వం అన్నారు. పంట వేయని భూములకు ₹25 వేల కోట్లు గత ప్రభుత్వం ఇచ్చింది…రైతు భరోసా 7500 క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇస్తాం అన్నారు.

మార్పులకు అనుగుణంగా రైతులను మారుస్తాం…ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ముఖ్యమంత్రి రుణమాఫీ అంశాన్ని తన భుజాన వేసుకున్నారు.గతంలో వైఎస్సార్ హయాంలో 70 వేల కోట్ల రుణమాఫీ చేశారు అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం..42 బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకుని రుణమాఫీ చేశామన్నారు.

Also Read:నల్గొండ కాంగ్రెస్‌లో వర్గపోరు..గుత్తా వర్సెస్ కోమటిరెడ్డి!

- Advertisement -