కేసీఆర్‌ కేబినెట్‌లోకి తుమ్మల..?

225
kcr tummala
- Advertisement -

ఎట్టకేలకు సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.వసంత పంచమి రోజు శుభదినం కావడంతో కేబినెట్‌ను విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సారి కేబినెట్ పాత,కొత్త కలయికతో ఉండనుంది. పలువురు కొత్తవారితో పాటు పాతవారికి స్ధానం కల్పించనున్నారు. 7 లేదా 8 మందితో కేబినెట్ విస్తరించనున్నట్లు టాక్. లోక్ సభ ఎన్నికల తర్వాత పూర్తిస్ధాయి మంత్రివర్గం కొలువుదీరనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు.

మంత్రివర్గ విస్తరణతో పాటు మండలి ఛైర్మన్,అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్,ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మండలి ఛైర్మన్‌గా కడియం శ్రీహరి పేరును పరిశీలిస్తుండగా ఈసారి కేబినెట్‌ విస్తరణలో ఎవరి పేర్లు ఉంటాయో అన్నదానిపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Related image

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో బెర్త్ ఖరారు కానుందని సన్నిహితవర్గాల సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుండి బరిలో దిగిన తుమ్మల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. పార్టీలో కొంతమంది వెన్నుపోటు పొడవడం వల్లే ఖమ్మం జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయని కేసీఆర్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మంలో పార్టీని బలోపేతం చేసేందుకు తుమ్మలకు కేబినెట్‌లో చోటు కల్పించనున్నట్లు సమాచారం.

ఈ వార్తలకు బలం చేకురేలా కేబినెట్‌లో ఈసారి గెలిచినోళ్లకే ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించారు కేసీఆర్. దీంతో తుమ్మల తన మినిస్టర్ క్వార్టర్ను ఖాళీ చేసేందుకు సిద్ధమవ్వగా కేసీఆర్ వారించారట. ఓ పక్క హరీశ్ రావు మినిస్టర్ క్వార్టర్ ను ఖాళీ చేస్తున్నా మిన్నకుండిపోయిన కేసీఆర్… తుమ్మలను మాత్రం నిలువరించడం చూస్తుంటే ఈ సారి కేబినెట్ విస్తరణలోనే ఆయనకు బెర్తు ఖాయమనే వాదనే వినిపిస్తోంది. మొత్తంగా కేసీఆర్ కేబినెట్ విస్తరణ ఎలా ఉండబోతుంది..ఎవరికి ఛాన్స్‌ దక్కుతుందో అన్న వార్తలతో పొలిటికల్ వర్గాల్లో హీట్ పెరిగిపోయింది.

- Advertisement -