ఉదయాన్నే తులసీ టీ..తెలిస్తే అస్సలు వదలరు!

37
- Advertisement -

భారత దేశంలో చాలా మంది తులసి మొక్కను దైవంగా భావించి పూజిస్తారు. తులసి ప్రకృతి ప్రసాదించిన వరం మన పెరట్లో దొరికే దివ్యౌషధం. పురాణాల్లో ఈ మొక్కకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. మహాభారత కాలంలో ఘటోత్కచుడు సైతం మోయలేని శ్రీ మహావిష్ణువుని ఒక్క తులసీ దళం తూయగలిగింది. అంత గొప్పది ఈ తులసి.

ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి లేదా ఆ రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.

వర్షాల సమయంలో వచ్చే సీజనల్ వ్యాధులు, వివిధ అంటువ్యాధుల సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తులసి ఆకులను తినడానికి ఇదే సరైన సమయం. ఇక ఉదయాన్నే తులసి హెర్బల్ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడమే కాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది తులసి జీర్ణవ్యవస్థను ఉపశమనం చేస్తుంది అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి లక్షణాలను తగ్గిస్తుంది.

కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.

Also Read:మహిళల్లో మధుమేహం..చాలా ప్రమాదం!

- Advertisement -