చిత్రవాహిని బ్యానర్‌.. టుక్ టుక్

12
- Advertisement -

చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌లు తమ తాజా చలనచిత్రం టైటిల్ “టుక్ టుక్” టైటిల్ పోస్టర్ ని శ్రీ రామ నవమి సందర్భంగా విడుదల చేశారు. విచిత్రమైన ఆటో ఈ పోస్టర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.

చూడడానికి ఏదో ఫాంటసీ చిత్రాన్ని తలపించేలా పోస్టర్ లుక్ ఉంది. సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన, “టుక్ టుక్” ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా ఉంది, అసలు కథలో ఆ ఆటో పాత్ర ఏంటి అనేది ముందు ముందు యూనిట్ సభ్యులు ఇచ్చే అప్డేట్స్ లో చూసి తెలుసుకోవాలిసి ఉంది.

పోస్టర్ లో అంశాలని బట్టి ఈ కథ ఒక గ్రామం నేపథ్యంలో సెట్ చేయబడింది. అనేక ఫాంటసీ ఎలెమెంట్స్ కూడా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. రాహుల్ రెడ్డి, లోక్కు సాయి వరుణ్ మరియు శ్రీరాములు రెడ్డి నిర్మించిన “టుక్ టుక్” క్రియేటివ్ తరహాలో ప్రేక్షకుల మనన్నలు పొందుతుంది. పోస్టర్ లో హీరో నో హీరోయిన్ ఓ కాకుండా ఈ ఆటో పెట్టడం వెనుక ఉన్న కథాంశం ఏంటి అనేది కూడా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనికి సంతు ఓంకార్ సంగీతం అందించారు మరియు హార్థిక్ శ్రీకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.”టుక్ టుక్” ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్ రైడ్‌గా ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నట్టు ఈ పోస్టర్ రెస్పాన్స్ బట్టి అర్ధమవుతుంది.

Also Read:Priyanka:బీజేపీకి 180 సీట్లు కూడా రావు

- Advertisement -