ట‌క్ జ‌గ‌దీష్.. ఫ‌స్ట్‌లుక్ కి మంచి రెస్పాన్స్

46
tuck jagadsh

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ట‌క్ జ‌గ‌దీష్’ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచుస్తున్న విష‌యం తెలిసిందే..టక్ జగదీష్’ టైటిల్ పోస్టర్ లో టక్ చేసుకుని నిలబడిన నాని బ్యాక్ సైడ్ లుక్ ని చూపించిన మేకర్స్.. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా నాని అభిమానులు,సినీ ప్రేమికులకు ఆనందం కలిగించే విధంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నాని వడ్డించిన విస్తరి ముందు టక్ వేసుకుని కూర్చొని వెనుక నుంచి కత్తి తీస్తున్నట్లుగా చూపించారు. నాని పాత్రపై సస్పెన్స్‌ను పెంచే విధంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ఇంటెన్స్ గా ఉన్న ఈ లుక్‌తో నాని అటు క్లాస్, ఇటు మాస్ ని చూపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. ఇది క్రిస్మ‌స్‌కు అభిమానుల‌కు సరైన ట్రీట్.

ఈ ఫ‌స్ట్‌లుక్‌తో పాటు ఈ సినిమాను ఏప్రిల్ 2021లో విడుద‌ల చేయ‌నున్నట్లు తెలిపారు మేక‌ర్స్‌.’నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. వీరిద్ద‌రి కాంబోలో మరో సూపర్ హిట్ రాబోతోందని ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అవుతోంది.ఈ సినిమాలో రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నాని న‌టిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.