టీటీడీ కార్మికుల అరెస్టు..

134
ap police
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 15 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయమని కోరుతూ శాంతియుతంగా టిటిడి పరిపాలనా భవనం వద్ద గత 15 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న విషయం విదితమే.

అయితే గురువారం సాయంత్రం ఈవో జవహర్ రెడ్డి చర్చల పేరుతో కార్మికులను పిలిపించుకుని బెదిరింపులకు దిగారు. కాంట్రాక్టు వ్యవస్థలో లోపాలు, సమస్యలు పరిష్కరించకుండా కార్మికుల పట్ల అన్యాయంగా ప్రవర్తించారు.

తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని కార్మికులు నిర్ణయించుకున్నారు. దీంతో టిటిడి అధికారులు, పోలీసులను ఉసిగొల్పి అర్ధరాత్రి సీటీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసి శుక్రవారం ఉదయం కల్లా టిటిడి పరిపాలనా భవనం వద్ద ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల నిరసన దీక్ష శిబిరానికి వందలాది మంది పోలీసులు వెళ్లి కార్మికులను నాయకుల్ని బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేశారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. అరెస్ట్ చేసిన వారిని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కి తరలించారు.

- Advertisement -