జూలై నెల నుండి సెప్టంబర్ 30వ తేది వరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాల రద్దు వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రేక్ దర్శనాలు రద్దైన తేది – కారణంః
– జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
– జూలై 17న ఆణివార ఆస్థానం.
– జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద.
– జూలై 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం.
– ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
– ఆగస్టు 24న పవిత్రోత్సవాల రెండో రోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ.
– సెప్టంబర్ 8న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
– సెప్టంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
– సెప్టంబర్ 15 నుండి 23వ తేది వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.
Also Read:హృదయం మురళి..అప్‌డేట్
పై తేదిలకు సంబంధించి ముందు రోజు తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది.

