ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి (నవంబర్ 27) ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి భక్తులు టోకెన్ల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
తిరుమల తిరుపతి దేవస్థానం TTD ఈ సంవత్సరం కూడా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ-డిప్ (E-Dip) పద్ధతిలో టోకెన్లను జారీ చేయనుంది. మొదటి మూడు రోజుల దర్శన టోకెన్ల కోసం ఈ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ జరుగుతుంది.
నమోదు గడువు: డిసెంబర్ 1 వరకు
రిజిస్ట్రేషన్ వేదికలు: భక్తులు TTD అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ మరియు ప్రభుత్వ వాట్సాప్ సర్వీసెస్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన ఈ-డిప్‌లో (లక్కీ డ్రా) ఎంపికైన భక్తులకు టోకెన్ల వివరాలు మెసేజ్ (SMS) ద్వారా వారి ఫోన్‌లకు పంపబడతాయి. భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని TTD విజ్ఞప్తి చేసింది.
Also Read:రివాల్వర్ రీటా..పక్కా కమర్షీయల్

