- Advertisement -
వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను టిటిడి ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు పరిశీలించారు. టిటిడి ఈవో జె. శ్యామలరావు, అడిషనల్ ఈఓ సి హెచ్ వెంకయ్య చౌదరి మరియు ఇతర అధికారులతో కలిసి ఛైర్మన్ ముందుగా స్థానిక బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఎస్‌ఎస్‌డి టోకెన్ జారీ కౌంటర్లను పరిశీలించారు.
అనంతరం ఔటర్ రింగ్ రోడ్డు, కృష్ణతేజ రెస్ట్ హౌస్‌లోని క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అన్నమయ్య భవన్‌లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ, జిల్లా, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనం కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.
Also Read:ఢిల్లీ ఎన్నికల నగారా..
- Advertisement -