TTD:అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు

1
- Advertisement -

టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు పడింది. 18 మంది ఉద్యోగులను బదిలీ చేశారు అధికారులు. టీటీడీలో మొత్తం 300 మంది అన్యమతస్తులు ఉన్నట్లు సమాచారం ఉండగా వీరిలో 18 మందిని బదిలీ చేశారు టీటీడీ అధికారులు.

బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళ‌ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఎస్వీయు అయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, వివిధ విద్య సంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహం వార్డెన్, తదితరులు ఉన్నారు.

తిరుమలలో రథసప్తమి సందర్భంగా మంగళవారం సాయంత్రం కల్పవృక్ష వాహనం అనంతరం మాడ వీధుల్లో టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, పలువురు పాలకమండలి సభ్యులు, టిటిడి ఈవో జె శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి వీరబ్రహ్మం ల ముందు భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడుతూ నాలుగు మాడ వీధుల్లో భక్తులు సౌకర్యార్థం టిటిడి అధికారులు, సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకులు విశేషంగా సేవలు అందించారన్నారు. వందకు వంద శాతం అద్భుతంగా సౌకర్యాలు కల్పించారని, ఇదే పద్దతిలో వచ్చే సంవత్సరం కూడా అందించాలని భక్తులు కోరారన్నారు. అందుకు తగ్గట్టుగా భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు కల్పిస్తామని ఛైర్మన్ తెలిపారు.

Also Read:చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు.. ప్రారంభం

- Advertisement -