తిరుమలలో అపశ్రుతి..6గురు మృతి

0
- Advertisement -

తిరుమలలో పెను విషాదం నెలకొంది వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా… బైరాగిపట్టెడ వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగింది.

భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో బైరాగిపట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి.

భక్తుల్లో మహిళలు, వృద్ధులు ఉండడంతో చాలామంది కిందపడిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తొక్కిసలాటలో పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు సీపీఆర్‌ వంటి చర్యలు చేపట్టారు.

Also Read:తెలంగాణలో ప్రతీకార రాజకీయం: జేపీ

- Advertisement -