13 గంటలపాటు టీటీడీ మూసివేత..

402
ttd
- Advertisement -

13 గంటల పాటు టీటీడీ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ నెల 21న సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి ఒంటిగంటకు నుండి ఆదివారం మధ్నాహ్నాం 2.30గంటలకు శ్రీవారి ఆలయం మూసిఉంటుందని చెప్పారు. సూర్యగ్రహణం ముగిసిన అనంతరం ఆలయాన్ని శుద్ది చేసిన తర్వాత భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు.

ప్రతిరోజూ మూడువేలు చొప్పున ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు ఇస్తున్నామని తెలిపిన అనిల్ కుమార్….ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలు,దర్శన టికెట్లు బుక్‌ చేసుకున్న వారు రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించామని తెలిపారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం జూన్‌ 30 వరకు రోజుకు మూడు వేల చొప్పున ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు జారీ చేశామని, ఆన్‌లైన్‌ టికెట్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలన్నారు.

- Advertisement -