TTD:శ్రీవారి ఆలయం విశేష ఉత్సవాలు

3
- Advertisement -

జూన్ నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలను గమనిస్తే.. జూన్ 07, 14, 21, 28 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు ఉండనుంది.

జూన్ 11వ తేదీన పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తిరుచ్చిపై ఊరేగింపు ఉండనుంది. జూన్ 25న అమావాస్య సందర్భంగా ఉ. 8.00 గం.లకు సహస్రకలశాభిషేకం, సా. 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగింపు ఉండనుంది. జూన్ 27న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం, సాయంత్రం 5.30 గం.లకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

జూన్ నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలను గమనిస్తే… జూన్ 11వ తేదీ పౌర్ణమి నాడు ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరగనుంది. జూన్ నెలలో దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు గమనిస్తే.. జూన్ 03న పుబ్బ నక్షత్రం సందర్భంగా సా.3.30 గం.లకు స్నపనం, సా.5.00 గం.లకు గ్రామోత్సవం, జూన్ 04న ఉత్తర నక్షత్రం, సా. 3.30 గం.లకు స్నపనం, సా.5 గం.లకు ప్రాకారోత్సవం ఉండనుంది.

జూన్ 15న శ్రవణ నక్షత్రం, ఉ. 10.గం.లకు కళ్యాణోత్సవం, సా.05 గం.లకు గ్రామోత్సవం, జూన్ 27న పునర్వసు నక్షత్రం, మ.3.30 గం.లకు స్నపనం, సా.5.గం.లకు గ్రామోత్సవం, ప్రతి శనివారం సా. 05 గం.లకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం జరగనుంది.

Also Read:GIC:హరితసేనలో నటి మధుమిత

- Advertisement -