ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

4
- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.

ఈ కార్యక్రమంలో పెద్ద‌జీయ‌ర్‌స్వామి, చిన్న‌జీయ‌ర్‌స్వామి,టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం కు చెందిన గుర్రం వెంకటేశ్వర్లు టెక్స్ టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీ అంకిత్ టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని (స్విమ్స్) పథకానికి గురువారం రూ.30 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు చెక్కును అందజేశారు.

Also Read:రూ.150 కోట్ల క్లబ్‌లో ‘మిరాయ్’

- Advertisement -